ap news: రాష్ట్రానికి మరో 9లక్షల డోసులు
close

తాజా వార్తలు

Published : 17/06/2021 18:42 IST

ap news: రాష్ట్రానికి మరో 9లక్షల డోసులు

అమరావతి: రాష్ట్రానికి మరో 9లక్షల కొవిడ్‌ టీకా డోసులు వచ్చాయి. పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్‌ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. దిల్లీ నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో 75 బాక్సుల్లో రాష్ట్రానికి టీకా డోసులు చేరుకున్నాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు వ్యాక్సిన్‌ తరలించారు. అక్కడి నుంచి  వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్‌ పంపనున్నారు. తాజాగా చేరుకున్న కొవిడ్‌ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్‌ కొరతకు ఉపశమనం కలిగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని