AP news: విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదు: కేంద్రం

తాజా వార్తలు

Published : 26/07/2021 15:02 IST

AP news: విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదు: కేంద్రం

దిల్లీ: విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో పునరాలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్‌సభలో వైకాపా ఎంపీ మాధవ్‌ ప్రశ్నకు కేంద్ర మంత్రి భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని గత కొన్ని నెలలుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకోవాలని కార్మికల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులతోపాటు వివిధ రాజకీయ పార్టీల నేతృత్వంలో గతంలో పాదయాత్రలు, బైక్‌ ర్యాలీలు చేపట్టారు. పరిశ్రమ పరిరక్షణే లక్ష్యంగా ఆగస్టు 1, 2 తేదీల్లో ‘చలో పార్లమెంట్‌’ చేపడుతున్నట్లు ఇటీవల పాదయాత్ర నిర్వహించిన కార్మిక సంఘాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు కూర్మన్నపాలెంలో చేపట్టిన నిరవధిక దీక్షలు 165వ రోజుకు చేరాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని