Corona: నిధుల కొర‌త లేదు:కేటీఆర్‌
close

తాజా వార్తలు

Updated : 16/05/2021 14:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: నిధుల కొర‌త లేదు:కేటీఆర్‌

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డికి నిధుల కొర‌త లేద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. కొవిడ్‌పై పోరుకు అనేక‌ ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని వివ‌రించారు. ఇత‌ర రాష్ట్రాల క‌రోనా బాధితుల‌కు కూడా చికిత్స అందిస్తున్నామ‌ని చెప్పారు. ఆక్సిజ‌న్, ఔష‌ధాల స‌ర‌ఫ‌రా పెంచాల‌ని కేంద్రాన్ని కోర‌గా.. సానుకూలంగా స్పందించింద‌ని మంత్రి అన్నారు. అంత‌కుముందు చైనా నుంచి తెలంగాణ‌ రాష్ట్రానికి 200 ఆక్సిజ‌న్ కాన్సంటేట‌ర్లు చేరాయి. వీటిని గ్రీన్‌కో సంస్థ దిగుమతి చేసింది. కార్గో విమానంలో ఇవి శంషాబాద్ విమానాశ్ర‌యానికి వ‌చ్చాయి. ఆక్సిజ‌న్ కాన్సంటేట‌ర్ల‌ను గ్రీన్‌కో ప్ర‌తినిధులు మంత్రి కేటీఆర్‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా గ్రీన్‌కో సంస్థ‌కు కేటీఆర్‌, సీఎస్ సోమేశ్ కుమార్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని