Mysterious Lights: ఆకాశంలో వింత కాంతి
close

తాజా వార్తలు

Published : 23/06/2021 01:22 IST

Mysterious Lights: ఆకాశంలో వింత కాంతి

జునాగఢ్‌: భారత్‌లో ఏలియన్స్ హడావుడి తక్కువే. ఆకాశంలో వింత ఆకారాలు, వింత వస్తువులు పెద్దగా కనిపించవు. కానీ గుజరాత్‌లోని జునాగఢ్‌లో సోమవారం రాత్రి 10 గంటలకు ఆకాశంలో వింత కాంతి కనిపించింది. అదేంటన్నది ఎవరికీ అంతుబట్టలేదు. చాలా మంది మొబైల్ కెమెరాలకు పనిచెప్పారు. ఈ ఎగిరే వస్తువులను చూసేందుకు ఇళ్ల నుంచి బయటికి వచ్చారు. రంగురంగులుగా మెరుస్తూ ఆ కాంతి కనిపించింది. అది ఉల్క కాదనీ.. ఉల్కే అయితే అంతసేపు ఆకాశంలో స్థిరంగా ఉండదని తేల్చారు. తారాజువ్వ కూడా క్షణాల్లో కింద పడిపోతుంది కాబట్టి.. తారాజువ్వ కూడా కాదని భావిస్తున్నారు. నాలుగు లైట్లతో ఉన్నట్లుగా కనిపించిన కాంతి.. ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఇప్పుడా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అదేంటనేది మాత్రం మిస్టరీగా ఉండిపోయింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని