కరోనాతో NSG కమాండో మృతి
close

తాజా వార్తలు

Updated : 06/05/2021 05:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో NSG కమాండో మృతి

దిల్లీ: దేశంలోని కౌంటర్‌ టెర్రరిస్ట్‌ కమాండో ఫోర్స్‌లో మొట్టమొదటి కరోనా మరణం నమోదయ్యింది. నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ సీనియర్‌ అధికారి బీకే ఝా (54) బుధవారం కొవిడ్‌తో మరణించారు. గ్రూప్‌ కమాండర్‌ (కోఆర్డినేషన్‌) బీకే ఝా (54)కు ఏప్రిల్‌ 19 కరోనా సోకడంతో సీపీఎఫ్‌ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నోయిడాలోని ఫోర్టిస్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయారు. వైద్యులు కమాండో ప్రాణాలు రక్షించడానికి అన్ని ప్రయాత్నాలు చేశారనీ, అయితే కమాండోకు గుండె పోటు రావడంతో ప్రాణాలు కాపాడలేక పోయారని అధికారులు తెలిపారు. 

ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌జీ  బీకే ఝా మృతికి సంతాపం తెలుపుతూ ‘‘డీజీ, అన్ని ర్యాంకుల ఎన్‌ఎస్‌జి అధికారులు కమాండో మరణం పట్ల సంతాపం తెలిపారు. దేశానికి ఆయన చేసిన విశిష్ట సేవలను మనం గుర్తుంచుకోవాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము’’ అని ట్వీట్‌ చేసింది. బీహార్‌కి చెందిన బీకే ఝా 2018లో డిప్యూటేషన్‌ మీద బీఎస్‌ఎఫ్‌ నుంచి ఎన్‌ఎస్‌జీకి బదిలీ ఆయ్యారు. కాగా ఎన్‌ఎస్‌జీలో ఇప్పటివరకూ 430 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 59 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. 
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని