బెలూన్‌ ఊది.. కరోనాను జయించి!
close

తాజా వార్తలు

Published : 13/05/2021 20:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెలూన్‌ ఊది.. కరోనాను జయించి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ ఊపిరితిత్తులను బాగా దెబ్బతీస్తోంది. ఊపిరి ఆడనీయకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్న వాళ్లే కరోనాకు భయపడుతుంటే.. ఒకే ఊపిరితిత్తితో కరోనాను జయించి అందరిలో ధైర్యాన్ని నింపుతోంది ఓ మహిళా నర్సు. వివరాల్లోకి వెళ్తే..  మధ్యప్రదేశ్‌కు చెందిన 39 ఏళ్ల ప్రఫుల్లిత్‌ పీటర్‌కు చిన్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి ఒక దాన్ని తొలగించారు. అప్పటి నుంచి ఆమె ఒకే ఊపిరితిత్తితో  బతుకుతున్నారు. కాగా ఇటీవల టికామ్‌గఢ్‌ ఆస్పత్రిలో కొవిడ్‌ వార్డులో నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమెకు వైరస్‌ సోకింది. అప్పటికే ఆమె రెండు డోసులు టీకా తీసుకోగా కరోనా సోకడంతో ఆమె గురించి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కానీ ప్రఫుల్లిత్‌ పీటర్‌ ఏ మాత్రం భయపడకుండా 14 రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండి కరోనా నుంచి బయట పడ్డారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పడు యోగా, ప్రాణాయామం, బెలూన్లు ఊదడం వంటి బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల తాను త్వరగా కోలుకున్నానని.. ధైర్యంగా ఉండటం వల్లే కరోనాను జయించానని ప్రఫుల్లిత్‌ పీటర్‌ చెప్పుకొచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని