ట్రంప్‌ అన్ని విధాలా విఫలమయ్యారు: ఒబామా

తాజా వార్తలు

Published : 20/08/2020 17:17 IST

ట్రంప్‌ అన్ని విధాలా విఫలమయ్యారు: ఒబామా

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఏమీ చేయలేకపోయారని, ఎందుకంటే అది ఆయన వల్ల కాని విషయమని మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా విమర్శించారు. డెమోక్రటిక్‌ జాతీయ సదస్సులో భాగంగా ట్రంప్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్‌ ట్రంప్‌ అనర్హుడని తెలిపారు. అమెరికా మంచి కోసం గతంలో తన హయాంలో ఉపాధ్యక్షుడిగా పని చేసిన జోబైడెన్‌కు అమెరికన్లు అవకాశమివ్వాలని  బరాక్‌ విజ్ఞప్తి చేశారు.

నాలుగేళ్ల పాలనలో అధ్యక్ష కార్యాలయం కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించడంపై ట్రంప్‌నకు ఏనాడూ ధ్యాస లేదని  అన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన పెంచుకునేందుకు కూడా ఏవిధమైన ప్రయత్నం చేయలేదని మాజీ అధ్యక్షుడు దుయ్యబట్టారు. తన పదవికి ఉన్న అపరిమితమైన అధికారాలు ప్రజల బాగోగుల కోసం కాకుండా కేవలం తన కోసం, తనవారి కోసం మాత్రమే ట్రంప్‌ వినియోగించారని విమర్శించారు. అధ్యక్ష స్థానాన్ని ఇంకో రియాల్టీ షోగా చూపడం మినహా ఏమీ చేయలేకపోయారని బరాక్‌ ధ్వజమెత్తారు. ట్రంప్‌ చేతకానితనం కారణంగా వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై అమెరికన్లు తీవ్ర విపరిణామాలు ఎదుర్కొన్నారని ఒబామా అన్నారు. కరోనా విషయంలో ట్రంప్‌ వైఫల్యం కారణంగా 1.70లక్షల మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని, లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆయన ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల నుంచి అమెరికన్లను బయట పడేయగలిగే శక్తి కేవలం జోబైడెన్‌కు మాత్రమే ఉందని ఒబామా పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని