Wild Life: చిరుతపులులకు డీఎన్‌ఏ టెస్టులు: ఒడిశా అటవీ, పర్యావరణ శాఖ నిర్ణయం

తాజా వార్తలు

Published : 02/08/2021 21:16 IST

Wild Life: చిరుతపులులకు డీఎన్‌ఏ టెస్టులు: ఒడిశా అటవీ, పర్యావరణ శాఖ నిర్ణయం

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఒడిశా రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలోని అడవుల్లో సంచరించే చిరుతపులుల డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ను చేపట్టేందుకు ప్రణాళిక రచించింది. గత నెలలో ఒడిశాలోని మూడు జిల్లాల నుంచి 10 చిరుతపులుల చర్మాలను అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అటవీశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.  ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయంలోని సెంటర్‌ ఫర్‌ వైల్డ్‌లైఫ్‌ హెల్త్ దీనికి సహకరిస్తుంది. అడవుల్లో చిరుతల మలాన్ని సేకరించి, పంజాగుర్తులను నమోదు చేసుకుని డీఎన్‌ఏ టెస్టుకోసం ప్రయోగశాలకు పంపిస్తారు. అలా చేయడంవల్ల భవిష్యత్తులో వేటగాళ్లు, అక్రమ రవాణాదారుల వద్ద చిరుత చర్మాలు పట్టుబడినప్పుడు అవి ఎక్కడికి చెందినవో వెంటనే గుర్తించేందుకు వీలవుతుంది. తద్వారా వన్యప్రాణులకు వ్యతిరేకంగా జరిగే నేరాలను అరికట్టడమేగాక, నేరస్థులకు తగినవిధంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 కింద శిక్షలు పడేలా చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. గత దశాబ్దకాలంగా ఒడిశాలో సుమారు 150 చిరుతలను చంపారు.  2018 లెక్కల ప్రకారం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో వాటి సంఖ్య కేవలం 760 మాత్రమే.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని