TS News: సీఎం కేసీఆర్‌ మంచి గైడెన్స్‌ ఇచ్చారు: సీఎస్‌

తాజా వార్తలు

Published : 23/10/2021 01:18 IST

TS News: సీఎం కేసీఆర్‌ మంచి గైడెన్స్‌ ఇచ్చారు: సీఎస్‌

తెలంగాణలో ఘనంగా శతకోటి టీకా సంబురం

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వ్యాక్సిన్ల పంపిణీ పూర్తయిన సందర్భంగా వైద్య సిబ్బంది సంబురాలు నిర్వహించారు. కోఠిలోని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో వైద్య సిబ్బందికి సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి అభినందనలు తెలిపారు. తెలంగాణలో 3 కోట్ల కరోనా టీకాల పంపిణీ పూర్తికావడంలో ఆరోగ్య సిబ్బంది కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలి కోటి డోసుల టీకా పంపిణీకి 165 రోజుల సమయం పట్టిందన్నారు. అయితే, రెండో కోటి డోసులకు 81 రోజుల సమయం పడితే.. మూడో కోటి డోసుల పంపిణీని మాత్రం కేవలం 36 రోజుల్లోనే పూర్తిచేశామని వివరించారు. 

వ్యాక్సిన్‌ విషయంలో సీఎం కేసీఆర్‌ మంచి మార్గదర్శకాలు ఇచ్చారన్నారు. జాతీయ సగటుతో పోలిస్తే వ్యాక్సినేషన్‌లో తెలంగాణ ముందుందని చెప్పారు. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో 27 వేల పడకలకు ఆక్సిజన్‌ సదుపాయం ఉందన్నారు. ప్రభుత్వం, వైద్యశాఖ సంయుక్త కృషితో ఈ మైలురాయి చేరుకున్నామన్నట్టు ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ అన్నారు. జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశామన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని