TS: ఒక్కరోజే లక్ష టెస్టులు.. లక్ష మందికి టీకా
close

తాజా వార్తలు

Updated : 09/04/2021 17:47 IST

TS: ఒక్కరోజే లక్ష టెస్టులు.. లక్ష మందికి టీకా

తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌

హైదరాబాద్: తెలంగాణలో నిన్న ఒక్కరోజే లక్ష కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటు లక్ష మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ వెల్లడించారు. ఈ మేరకు కొవిడ్‌ పరీక్షలు, టీకాలకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రజల్లో కరోనా వ్యాక్సినేషన్‌పై అవగాహన పెరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1100పైగా కేంద్రాల్లో వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని.. రాబోయే రోజుల్లో మరింత విస్తృతం చేస్తామన్నారు. రాష్ట్రంలో 1,064 కేంద్రాల్లో యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని మరో 15 జిల్లా కేంద్రాల్లో రాబోయే రోజుల్లో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి 25వేలకుపైగా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాల్లో సెరో సర్వే చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పరిధిలోని సుమారు 10వేల పడకల్లో 80 శాతం వరకు ఖాళీగానే ఉన్నాయన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని