‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’తో  వలస కార్మికులకు మేలు
close

తాజా వార్తలు

Updated : 14/06/2021 19:57 IST

‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’తో  వలస కార్మికులకు మేలు

సుప్రీంకోర్టుకు వివరించిన కేంద్రం

దిల్లీ: ‘ఒకే దేశం.. ఒకే రేషన్‌ కార్డు’పథకంతో  కొవిడ్‌ కష్ట కాలంలో వలస కార్మికులకు చాలా మేలు కలుగుతుందని అని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఈ విధానం ద్వారా వారికి దేశంలో ఏ ప్రాంతంలోని చౌక ధరల దుకాణాల ద్వారానైనా ఆహార ధాన్యాలను పొందే వీలు కలుగుతుందని తెలిపింది. లాక్‌డౌన్‌లో వలస కార్మికుల కష్టాలపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు వివరాలు అడిగింది. ఈ నేపథ్యంలో సోమవారం కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో సర్కారు ఈ పథకం గురించి పలు అంశాలను  వివరించింది.   అత్యంత చౌకగా అందించేందుకు తగినన్ని ఆహార ధాన్యాలను అందుబాటులో ఉంచాలని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చినట్లు కేంద్రం పేర్కొంది. 

జాతీయ ఆహార భద్రత పథకం కిందికి వచ్చే 80 కోట్ల మంది రేషన్‌కార్డుదారులకు ‘ఒకే దేశం.. ఒకే రేషన్‌ కార్డు’ద్వారా  సమానంగా లబ్ధి చేకూరనున్నట్టు కోర్టుకు కేంద్రం తెలిపింది.  బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే వారిని దృష్టిలో పెట్టుకొని ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించింది. గతేడాది డిసెంబరు నాటికి వీరిలో 86 శాతం మందికి ఈ పథకంతో లబ్ధి చేకూరినట్టు పేర్కొంది. అసోం, ఛత్తీస్‌గఢ్‌, దిల్లీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఈ విధానం అమలు కావడం లేదని.. త్వరలోనే అక్కడ కూడా అమలవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని