క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల్లో ఆప‌రేష‌న్ ముస్కాన్ 

తాజా వార్తలు

Published : 19/05/2021 16:11 IST

క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల్లో ఆప‌రేష‌న్ ముస్కాన్ 

క‌ర్నూలు: ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాల మేర‌కు క‌ర్నూలు, క‌డ‌ప జిల్లాల్లో ఆప‌రేష‌న్ ముస్కాన్ కొవిడ్‌-19 స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా త‌ప్పిపోయిన బాల‌ల కోసం పోలీసులు రైల్వే స్టేష‌న్లు, బ‌స్టాండ్లు, హోట‌ళ్ల‌లో గాలింపు చేస్తున్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో 20 మంది చిన్నారుల‌ను గుర్తించి వారికి అల్పాహారం అందించారు. కిరాణా దుకాణాలు, మెకానిక్ షాపులు, పారిశ్రామిక వాడ‌లు త‌దిత‌ర చోట్ల ప‌ని చేస్తున్న చిన్నారుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌ర‌కు చేరేలా పోలీసులు చర్య‌లు తీసుకుంటున్నారు. కొవిడ్ వేళ బాల‌ల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంతో పాటు మాస్కులు, శానిటైజ‌ర్ల‌ను అందిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని