ఇమ్యూని‘టీ’

తాజా వార్తలు

Published : 26/05/2021 23:32 IST

ఇమ్యూని‘టీ’

మసాలా టీ ఉపయోగాన్ని వివరించిన న్యూట్రిషనిస్టు ల్యూక్‌ కౌటినో

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో చాలామందిలో ఇమ్యూనిటీపై ఆలోచన మొదలైంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు వ్యాయామం చేయడంతోపాటు ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు. తాజా పండ్ల నుంచి డ్రై ఫ్రూట్స్‌ వరకు ఎందులో మంచి పోషక విలువలున్నాయో అన్వేషణ ప్రారంభించారు. అయితే మనం నిత్యం సేవించే మసాలా టీలో ఇమ్యూనిటీ పెంచే గుణం ఉందని ఎవరికైనా తెలుసా? అవును, మసాలా టీ తాగి ఇమ్యూనిటీని పెంచుకోవచ్చని చెబుతున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్టు ల్యూక్‌ కౌటినో. ప్రపంచవ్యాప్తంగా చాయ్‌కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామందికి పొద్దున్నే నిద్ర లేవగానే ఓ కప్పు చాయ్‌ తాగనిదే ఆ రోజు ప్రారంభం కాదు. లెమన్‌ టీ, గ్రీన్‌ టీ, అల్లం టీ, బ్లాక్‌ టీ.. ఇలా ఎన్ని రకాలున్నా మసాలా టీ అభిమానుల సంఖ్యే ఎక్కువ. అలాంటి మసాలా టీలో ఉండే ఆరోగ్యపరమైన లాభాలను వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ల్యూక్‌ కౌటినో పోస్టు చేశారు. ‘‘మీలో ఎంతమంది ఇండియన్‌ మసాలా టీ తాగుతున్నారు.. ఇది ఇమ్యూనిటీని పెంచే చాయ్‌’’ అని తన పోస్టులో రాశారు. చాయ్ తయారీలో ఉపయోగించే టీ పొడి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, నల్ల మిరియాలు, అల్లం లాంటి మసాలా దినుసులకు శరీరంలో ఇమ్యూనిటీని పెంచే సామర్థ్యం ఉందని వివరించడమే కాకుండా.. మసాలా టీ తయారీ విధానాన్ని కూడా ఆయన పోస్టు చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని