Corona: ఏపీలో ఆక్సిజన్‌ ఆడిట్‌
close

తాజా వార్తలు

Published : 26/04/2021 13:35 IST

Corona: ఏపీలో ఆక్సిజన్‌ ఆడిట్‌

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

అమరావతి: రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ఆడిట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఆస్పత్రుల వారీగా సరఫరా అయ్యే ఆక్సిజన్‌ లెక్కలు తీయాలని నిర్ణయించింది. రోజువారీ వినియోగం, ఆక్సిజన్‌ పడకలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఒక్కో ఆస్పత్రిలో ఎన్ని ట్యాంకుల ఆక్సిజన్‌ వాడారనే దానిపై ఆడిటింగ్‌కు ఆదేశించింది. రోజువారీ అవసరాలకు 330 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కావాలని.. ప్రస్తుతం  దాదాపు 290 మెట్రిక్‌ టన్నులే ఉందని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

విశాఖతో పాటు భువనేశ్వర్‌, బళ్లారి నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్‌ సరఫరా అవుతోంది. వచ్చిన ఆక్సిజన్‌ను త్వరతగతిన ఆస్పత్రులకు పంపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 42 ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి ఆస్పత్రులకు సరఫరా చేయాలని నిర్ణయించారు. అత్యవసరం అనుకున్నవారికి, ఆక్సిజన్‌ స్థాయి 94 కంటే తక్కువ ఉన్నవారికి  మాత్రమే సరఫరా చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చసింది. ఆక్సిజన్‌ సరఫరా సమన్వయ బాధ్యతలను ప్రత్యేకాధికారిగా నియమితులైన ఐఏఎస్‌ అధికారి షన్మోహన్‌కు అప్పగించింది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని