Viral video: మొన్న చీరతో.. ఇప్పుడు హైహీల్స్‌తో.. గాల్లో పారుల్‌ విన్యాసాలు అదుర్స్‌!

తాజా వార్తలు

Published : 25/11/2021 18:20 IST

Viral video: మొన్న చీరతో.. ఇప్పుడు హైహీల్స్‌తో.. గాల్లో పారుల్‌ విన్యాసాలు అదుర్స్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: హరియాణాకు చెందిన ప్రముఖ జిమ్నాస్ట్‌ పారుల్‌ అరోడా తన అద్భుత ప్రదర్శనతో మరోసారి అబ్బురపరిచారు. గతంలో చీరతోనే అమాంతం గాల్లో పల్టీలు కొట్టి తన సాహసాన్ని చాటిన ఆమె‌.. తాజాగా స్కర్ట్‌, హైహీల్స్‌తో కార్ట్‌వీల్‌ ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. పింక్‌ స్కర్ట్‌, బ్లూ టాప్‌తో హైహీల్స్‌ ధరించిన పారుల్‌.. గాల్లో పల్టీలు కొట్టి మరోసారి తన టాలెంట్‌ను ప్రదర్శించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పారుల్‌ జాతీయ స్థాయిలో అనేక బంగారు పతకాలు సాధించిన జిమ్నాస్టే కాకుండా మంచి ఫిట్‌నెస్‌ మోడల్‌ కూడా. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.42లక్షల మందికి పైగా ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఈ సంచలన జిమ్నాస్ట్‌.. ‘హైహీల్స్‌’ క్యాప్సన్‌తో తాజాగా పోస్ట్ చేసిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని