కడప ఘటనపై పవన్‌ దిగ్భ్రాంతి
close

తాజా వార్తలు

Published : 09/05/2021 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కడప ఘటనపై పవన్‌ దిగ్భ్రాంతి

అమరావతి: కడప జిల్లాలో పేలుడు ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ధాటికి 10 మంది మృతి చెందడం బాధాకరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, గని యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం: సురేశ్‌

కడప జిల్లా  ఘటనపై ఏపీ మంత్రి సురేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కలెక్టర్‌, ఎస్పీల నుంచి అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కలసపాడు మండలంలోని మామిళ్లపల్లె శివారులో తిరుమల కొండ సమీపంలోని బైరటీస్‌ గనుల్లో జిలెటిన్‌స్టిక్స్‌ పేలడంతో 10 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. బద్వేలు నుంచి ముగ్గురాళ్ల గనికి వాహనంలో జిలెటిన్‌ స్టిక్స్‌ తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని