Rains: రోడ్లమీదకు వచ్చిన చేపలు.. ఎగబడిన జనాలు

తాజా వార్తలు

Published : 24/07/2021 01:07 IST

Rains: రోడ్లమీదకు వచ్చిన చేపలు.. ఎగబడిన జనాలు

హైదరాబాద్‌: చేపలు పట్టాలంటే సముద్రానికో లేదంటే ఊరి చివర ఉన్న చెరువుకో వెళ్లాలి. కానీ, చేపలే మన దగ్గరికొస్తే ఆ అనుభూతి చెప్పలేం. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాల పుణ్యమా అని చేపలు పొలాలు, ఇళ్లు, ఆఖరికి రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. కళ్లముందే చేపలు కనిపించడంతో జనాలు వేటకు వేళాయేరా అంటూ వాటిని పట్టుకునేందుకు పరుగులు పెడుతున్నారు. జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి మండలం, మేడిపల్లి, బండిలింగాపూర్‌ గ్రామాలకు చెందిన చెరువు గట్లు తెగిపోవడంతో చేపలు పొలాలు, ఇళ్లు, రోడ్ల మీదకు వస్తున్నాయి. ఆ చేపలు పట్టేందుకు జనాలు పోటీ పడుతున్నారు. రోడ్ల మీదకు వచ్చిన చేపలు పట్టేందుకు జనాలు గుమిగూడటంతో రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని