బ్రహ్మంగారిమఠం పీఠాధిపత్యంపై పిటిషన్‌

తాజా వార్తలు

Updated : 30/06/2021 12:36 IST

బ్రహ్మంగారిమఠం పీఠాధిపత్యంపై పిటిషన్‌

అమరావతి: కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో కొలిక్కి వచ్చిందనుకుంటున్న పీఠాధిపత్యం వివాదం మళ్లీ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది. దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ పీఠాధిపతి విషయంపై హైకోర్టును ఆశ్రయించింది. పెద్ద మనుషుల రాజీ చర్చల్లో బలవంతంగా తమను ఒప్పించారని ఆరోపిస్తూ ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. పీఠాధిపతి నియామకం అనేది వీలునామా ప్రకారమా.?లేదా కుటుంబ సభ్యుల ఒప్పందం ప్రకారమా?అనేది తేల్చాలని హైకోర్టుకు విన్నవించారు. వీలునామా ప్రకారం తన కుమారుడికే పీఠాధిపత్యం దక్కాలని కోరుకుంటున్నానన్నారు. వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని పిటిషన్‌ వేసినట్లు వివరించారు. ఈ విషయాన్ని భక్తులు, గ్రామస్థులు అర్థం చేసుకోవాలని ఆమె కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని