ధూళిపాళ్ల తరలింపుపై అనిశా కోర్టులో పిటిషన్‌

తాజా వార్తలు

Published : 13/05/2021 19:10 IST

ధూళిపాళ్ల తరలింపుపై అనిశా కోర్టులో పిటిషన్‌

విజయవాడ: సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అరెస్టయిన తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (అనిశా) అధికారులు రాజమహేంద్రవరం జైలుకు తరలించడంపై అనిశా కోర్టులో పిటిషన్‌ దాఖలైంది.  దీనిపై విచారణ చేపట్టిన అనిశా కోర్టు..తమకు తెలియకుండా జ్యుడీషియల్‌ రిమాండ్‌లోని నరేంద్రను ఎలా తరలిస్తారని ప్రశ్నించింది. తరలింపుపై కోర్టు అనుమతి ఎందుకు తీసుకోలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. నరేంద్ర వారం రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు తెలిపారని, అయినప్పటికీ ఎలా తరలించారని అన్నారు. ఆయన్ను వెంటనే రాజమహేంద్రవరం ప్రైవేటు ఆస్పత్రికిగానీ, విజయవాడ ఆయుష్‌ ఆస్పత్రికిగానీ తరలించాలని ఆదేశించారు. విజయవాడ తీసుకెళ్లడం కష్టమవుతుందని అనిశా అధికారులు కోర్టుకు తెలిపారు. ఈసారి కోర్టు అనుమతి లేకుండా నరేంద్రను తరలించవద్దని న్యాయమూర్తి ఆదేశించారు.  సంగం డెయిరీ కేసులో అరెస్టయిన నరేంద్రకు రాజమహేంద్రవరం జైలులో కరోనా సోకింది. దీంతో ఇప్పటి వరకు విజయవాడలోని ఆయుష్‌ ఆస్పత్రిలోనే ఆయన చికిత్స పొందారు. తాజాగా నెగటివ్‌ రావడంతో ఆయన్ను తిరిగి జైలుకు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని