ఎల్లుండే.. ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చ’
close

తాజా వార్తలు

Published : 05/04/2021 14:38 IST

ఎల్లుండే.. ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చ’

దిల్లీ: విద్యార్థుల్లో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం ఎల్లుండి జరగనుంది. ఏప్రిల్‌ 7వ తేదీన రాత్రి ఏడు గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మోదీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది సమావేశాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు మోదీ ఫిబ్రవరిలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. 

‘ఈ సారి పరీక్షా పే చర్చ కార్యక్రమం కొత్త పద్దతిలో జరగనుంది. విభిన్న అంశాలపై ఆసక్తికరమైన ప్రశ్నలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో చిరస్మరణీయంగా గుర్తుండిపోయే చర్చ జరగనుంది.  ఏప్రిల్‌ 7వ తేదీన రాత్రి 7గంటలకు జరిగే చర్చను అందరూ వీక్షించండి’ అంటూ మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 16న దిల్లీలో తొలిసారి నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టి, పలు అంశాలపై వారి సందేహాలను నివృత్తి చేస్తుంటారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని