వచ్చే ఏడాది ఏప్రిల్‌ కల్లా పోలవరం పూర్తి

తాజా వార్తలు

Published : 08/03/2021 14:15 IST

వచ్చే ఏడాది ఏప్రిల్‌ కల్లా పోలవరం పూర్తి

స్పష్టం చేసిన కేంద్రం

దిల్లీ: పోలవరం ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది ఏప్రిల్‌కి పూర్తవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. తెదేపా  ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కటారియా రాజ్యసభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సవరించిన షెడ్యూల్‌ మేరకు వివరాలు ఇస్తున్నామని తెలిపారు. ఏయే పనులు ఎప్పటికి పూర్తవుతాయో వివరించారు. మే నాటికి స్పిల్‌వే పనులు, ఏప్రిల్‌ నాటికి క్రస్టు గేట్ల పనులు పూర్తవుతాయన్నారు. పోలవరం కాపర్‌ డ్యామ్‌ నిర్మాణం జూన్‌ కల్లా పూర్తవుతుందన్నారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ కుడి, ఎడమ కాల్వలు  ఏప్రిల్‌, 2022 నాటికి పూర్తి చేస్తామన్నారు. భూ సేకరణ, పునరావాస పనులు కూడా ఏప్రిల్‌, 2022కే పూర్తవుతాయని కటారియా స్పష్టం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని