AP News: సంజూ కోసం డ్రోన్లతో గాలింపు

తాజా వార్తలు

Updated : 05/07/2021 14:05 IST

AP News: సంజూ కోసం డ్రోన్లతో గాలింపు

కలువాయి: నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి పరిధిలోని అటవీ ప్రాంతంలో తప్పిపోయిన బాలుడు సంజూ(3) కోసం ఎనిమిది రోజులుగా గాలింపు కొనసాగుతోంది. పోలీసులు ప్రత్యేక బలగాలతో వెతుకుతున్నారు. చిన్నారి ఆచూకీ కనుగొనేందుకు రెండు రోజులుగా రెండు డ్రోన్‌ కెమెరాలతో గాలిస్తున్నారు. అపహరణ కోణంలోనూ పోలీసులు సమీపంలోని గ్రామాల్లో వెతుకుతున్నారు. గత నెల 28న ఉయ్యాలపల్లిలో గొర్రెలు మేపడానికి వెళ్లిన తండ్రి వెనకే వెళ్లిన సంజూ తప్పిపోయాడు. మరుసటి రోజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి గాలింపు కొనసాగుతూనే ఉంది. సంజూ ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని