మండపంలో వధూవరులు.. కారులో నుంచే మంత్రోచ్ఛరణ

తాజా వార్తలు

Published : 20/05/2021 01:17 IST

మండపంలో వధూవరులు.. కారులో నుంచే మంత్రోచ్ఛరణ

సిద్దిపేట: వధూవరులు పక్కపక్కన కూర్చొని ఉండగా.. వారికి ఒక పక్కగా పురోహితుడు ఉండి వారి చేత వేద మంత్రాలు చదివిస్తూ వివాహం జరిపిస్తాడు. హిందూ వివాహాలు జరిగే పద్ధతి ఇది. కానీ కరోనా తెచ్చిన భయమో.. జాగ్రత్తో తెలియదు కానీ ఓ పురోహితుడు మాత్రం పెళ్లి మండపంలోకి రాకుండానే వివాహం జరిపించేశాడు. ఆన్‌లైన్‌లో వీడియో కాల్‌ ద్వారా పెళ్లి జరిపించాడు అనుకుంటే పొరపాటే. కల్యాణ వేదిక వద్దకు కారులో వచ్చిన పురోహితుడు అదే కారులో కూర్చొని మైక్‌లో మంత్రాలు చదువుతూ వివాహం జరిపించాడు. సిద్దిపేట జిల్లా కోహెడలో ఓ జంట వివాహం జరిపేందుకు ప్రసాదరావు శర్మ అనే పురోహితుడు చేసిన ఈ తతంగం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని