Lockdown పట్టని వైనం.. ఇదీ జనం తీరు!
close

తాజా వార్తలు

Updated : 16/05/2021 12:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lockdown పట్టని వైనం.. ఇదీ జనం తీరు!

హైదరాబాద్‌: కరోనా కేసుల ఉద్ధృతి దృష్ట్యా తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించినా కొందరు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రాణం మీదికి వస్తున్నా ఖాతరు చేయడం లేదు. ఆదివారం కావడంతో హైదరాబాద్‌ నగరంలోని పలు చేపల మార్కెట్లు, చికెన్‌, మటన్‌ దుకాణాల వద్ద భారీ రద్దీ నెలకొంది. పెద్ద సంఖ్యలో గుమిగూడంతో పాటు అక్కడికి వచ్చిన వారు కొవిడ్‌ నిబంధనలు ఏమాత్రం పాటించలేదు. భౌతిక దూరం పాటించలేదు సరికదా.. మాస్కులు కూడా సరిగా ధరించలేదు. కూకట్‌పల్లి- జగద్గిరిగుట్ట మార్గంలో ఒక్కసారిగా జనాలు రోడ్లపైకి రావడంతో కరోనా నిబంధనలు గాల్లో కలిసిపోయాయి. 

మరికొన్ని చోట్ల ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉన్నా.. ఆ తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కేపీహెచ్‌బీ కాలనీ, కుత్బుల్లాపూర్‌ ప్రగతినగర్‌ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల తర్వాత కూడా చేపల విక్రయాలు చేపట్టడంతో పోలీసులు అక్కడి వారిని చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పారు. 

ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వాలు ఎన్ని కట్టడి చర్యలు చేపట్టినా.. కనీస వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ప్రజల బాధ్యత. ఇప్పటికీ అశ్రద్ధగా, బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తస్మాత్‌ జాగ్రత్త..!  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని