తెలుగురాష్ట్రాల్లో పల్స్‌పోలియో ప్రారంభం

తాజా వార్తలు

Updated : 31/01/2021 15:29 IST

తెలుగురాష్ట్రాల్లో పల్స్‌పోలియో ప్రారంభం

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో పల్స్‌పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. తెలంగాణలోని 33 జిల్లాల్లో చుక్కల పంపిణీ జరుగుతోంది. మూడురోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 3 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తెలంగాణలో మొత్తం 38,31,907 మంది ఐదేళ్లలోపు చిన్నారులున్నారు. వీరందరికీ పోలియో చుక్కలు పంపిణీ చేయడానికి 23,331 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నగరంలోని శామీర్‌పేట్‌ పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో కార్యక్రమంలో మంత్రులు ఈటల, మల్లారెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 877 మొబైల్‌ టీమ్స్‌ ద్వారా పోలియో చుక్కలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ఈటల తెలిపారు. పల్స్‌పోలియో ముగిసిన వెంటనే కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. మీడియా సిబ్బందికి టీకా ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. శామీర్‌పేట్‌ ఆస్పత్రిని ట్రామా కేర్‌ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని ఈటల వ్యాఖ్యానించారు. 

మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి, కందుకూరులో మంత్రి సబిత ఇంద్రారెడ్డి పిల్లలకు పోలియో చుక్కలు వేసి పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే దివాకర్ రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నీరజ పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో పల్స్‌పోలియో కార్యక్రమం మొదలైంది. తిరుమలలో శ్రీవారి ఆలయంతో పాటు 25 చోట్ల పోలియో చుక్కల శిబిరాలను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలం, కోసురువారిపాలెం లో చిన్నారులకు వైద్యసిబ్బంది పల్స్ పోలియో చుక్కలు వేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పురపాలక సంఘ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. కేంద్ర పాలితప్రాంతమైన యానాంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు 24 సెంటర్లను ఏర్పాటు చేశారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాధవకుమార్ రెడ్డి, ప్రభుత్వ అధికారి హిమబిందు ప్రారంభించారు.

ఇవీ చదవండి..

అందుబాటులోకి సరికొత్త ఎండోస్కోపీ!

పల్లీ... మాంచి చిరుతిండి!Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని