Raghurama: భరత్‌ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ

తాజా వార్తలు

Updated : 25/05/2021 14:15 IST

Raghurama: భరత్‌ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ

దిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో ఏపీ సీఐడీ అధికారులు చిత్రహింసలకు గురిచేశారంటూ ఆయన కుమారుడు భరత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై జస్టిస్‌ వినీత్‌ శరన్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సీబీఐని ప్రతివాదిగా చేర్చేందుకు పిటిషనర్‌ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ అనుమతి కోరారు. కేంద్ర ప్రభుత్వం మినహా ఏపీ ప్రభుత్వం, ఏపీ డీజీపీ వంటి ప్రతివాదులను జాబితా నుంచి తొలగించేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. కస్టడీలో ఉన్న ఎంపీని చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతున్నట్లు తెలిపారు. 

మరోవైపు ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా లేకుండా చేయడంపై ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే అభ్యంతరం తెలిపారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ ప్రతివాదుల జాబితాలో మార్పులు చేసేందుకు అనుమతించింది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని