Rahul Gandhi: రాహుల్‌, ప్రియాంకా గాంధీ చిన్ననాటి ఫొటో చూశారా?

తాజా వార్తలు

Published : 23/08/2021 01:20 IST

Rahul Gandhi: రాహుల్‌, ప్రియాంకా గాంధీ చిన్ననాటి ఫొటో చూశారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: రక్షా బంధన్ పండగ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకా గాంధీకి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంకతో కలిసి దిగిన చిన్నప్పటి ఫొటోను నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది.

‘నా సోదరి ప్రేమ, ఆప్యాయతలకు నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. మేమిద్దరం మంచి మిత్రులం. అలాగే ఎల్లప్పుడు ఒకరికొకరం రక్షణగా ఉంటాం. రక్షా బంధన్‌ పండగ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని రాహుల్‌ తన పోస్టులో పేర్కొన్నారు. దీన్ని ప్రియాంక గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీల్లో షేర్‌ చేశారు.

అంతకుముందు రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఓనం పండగను సమానత్వం, ఐకమత్యానికి స్ఫూర్తిగా జరుపుకొంటాం. ఇది కేరళ బహుళత్వ స్ఫూర్తిని సూచిస్తుంది. వారితో చాలా దగ్గరగా ఈ పండగను జరుపుకొన్నందుకు నేను సంతోషిస్తున్నాను. అందరికీ ఓనం శుభాకాంక్షలు” అని రాహుల్‌గాంధీ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని