AP News: కర్నూలు జిల్లాలో జోరుగా వర్షాలు

తాజా వార్తలు

Updated : 27/06/2021 14:26 IST

AP News: కర్నూలు జిల్లాలో జోరుగా వర్షాలు

కర్నూలు: కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కోడుమూరు, కౌతాళం, కోసిగి, ఆదోని, ఎమ్మిగనూరు, నందవరం, పెద్దకడుబూరు, ఆస్పరి, బండి ఆత్మకూరు, నంద్యాల, సున్నిపెంట, సి బెళగల్, పత్తికొండ మండలాల్లో వర్షం పడుతోంది. నందవరం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ, కోడుమూరు పట్టణంలోని పలు కాలనీల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. కోడుమూరు మండలం వర్కూరు వద్ద తుమ్మలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆ వాగులో చిక్కుకున్న హెచ్‌పీ గ్యాస్ లారీ డ్రైవర్‌ను స్థానికులు కాపాడారు. నందవరం మండలం పెద్దకొత్తిలిలో వాగు ఉద్ధృతికి పంట పొలాలు నీట మునిగాయి. కోడుమూరు మండలం పెంచికలపాడు వద్ద వక్కలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద కారణంగా కర్నూలు- ఎమ్మిగనూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని