వైద్యుల ఘనత: అవయవ మార్పిడి జరిగిన మహిళకు కాన్పు!
close

తాజా వార్తలు

Published : 16/06/2021 01:18 IST

వైద్యుల ఘనత: అవయవ మార్పిడి జరిగిన మహిళకు కాన్పు!

మైసూరు: దేశంలోనే తొలిసారిగా కర్ణాటకలోని మైసూరులో అవయవ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న ఓ గర్భిణీకి వైద్యులు విజయవంతంగా కాన్పు చేశారు. డయాబెటిస్‌తో బాధపడుతూ కాన్పు కోసం ఆస్పత్రిలో చేరిన 35 ఏళ్ల మహిళకు మైసూరులోని అపోలో బీజీఎస్ వైద్యులు విజయవంతంగా కాన్పు చేశారు. చిన్నప్పట్నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సదరు మహిళకు మూడేళ్ల కిందట కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మహిళ మగ శిశువుకు జన్మనిచ్చినట్లు తెలిపిన వైద్యులు.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. అవయవ మార్పిడి తర్వాత సాధారణ కాన్పు ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చిన తొలి కేసు దేశంలో ఇదేనని చెబుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని