అరసవల్లిలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు

తాజా వార్తలు

Published : 19/02/2021 03:16 IST

అరసవల్లిలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు

శ్రీకాకుళం సాంస్కృతికం, అరసవల్లి, బలగ: ఏటా మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి పర్వదినంగా, సూర్య జయంతిగా భక్తజనులు ఘనంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. అరసవల్లి సూరీడు అందరి దేవుడు. అందుకే అనాది నుంచి ఏడాదికోమారు ఈ రోజున సూర్య భగవానుని నిజరూప దర్శనం భక్తులకు మరపురాని మధురానుభూతిని కలిగించే ఘట్టంగా నిలుస్తోంది. ఇందులో భాగంగానే గురువారం అర్ధరాత్రి నుంచే అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిస్వామి, ఆలయ ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌.సుజాత స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛరణల  మధ్య స్వామికి మహాక్షీరాభిషేకం జరిగింది. స్వామివారి నిజరూపాన్ని వీక్షించేందుకు రాత్రి నుంచే క్యూలైన్లలో భక్తులు బారులుదీరారు.  నగర ప్రధాన వీధుల్లో అర్ధరాత్రి  నుంచే భక్తుల తాకిడి మొదలైంది. శాసన సభాపతి తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, కలెక్టరు జె.నివాస్, ఎమ్మెల్యేలు  ధర్మాన ప్రసాదరావు, గొర్లె కిరణకుమార్‌ వైకాపా నేతలు మామిడి శ్రీకాంత్, దువ్వాడ శ్రీనివాస్, కిల్లి కృపారాణి దంపతులు, తెదేపా మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, తదితరులు స్వామిని దర్శించుకున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని