సవాళ్లు స్వీకరించకుంటే నష్టాలే!

తాజా వార్తలు

Published : 27/08/2020 21:40 IST

సవాళ్లు స్వీకరించకుంటే నష్టాలే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కారణంగా ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌ శక్తికాంతదాస్‌ బ్యాంకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని పరోక్షంగా హితవు పలికారు. సవాళ్లను స్వీకరించకుండా మితిమీరి తప్పించుకోవడం అంటే సొంతంగా ఓటమిని కొని తెచ్చుకోవడమే అని శక్తికాంతదాస్‌ హెచ్చరించారు. బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన బ్యాంకులు తమ మౌలిక నిధిని నిర్వహించకుంటే ఆదాయం రాదని తెలిపారు.

మోసాలు జరగకుండా తప్పించుకునేందుకు బ్యాంకులకు ఇంకా అవకాశముందన్నారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు అవి రూపొందించుకునే విధివిధానాలు సమస్యలను తగ్గిస్తాయని హితవు పలికారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ బలంగా, స్థిరంగా ఉందన్న ఆర్‌బీఐ గవర్నర్‌ మరింత వృద్ధి కోసం రాబోయే రోజుల్లో కొత్త విధానాలను రూపొందించుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆయన ప్రశంసలు కురిపించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని