Ts News: ఆధునిక హంగులతో రెడీమేడ్‌ ఇల్లు

తాజా వార్తలు

Published : 05/07/2021 21:56 IST

Ts News: ఆధునిక హంగులతో రెడీమేడ్‌ ఇల్లు

సూర్యాపేట: ఆధునిక హంగులతో రెడీమేడ్ ఇల్లు సిద్ధమైంది. అది కూడా కేవలం ₹6 లక్షల వ్యయంతోనే జరిగింది. అన్నిరకాల సౌకర్యాలతో కూడిన ఈ రెడీమేడ్ ఇల్లు సూర్యాపేట జిల్లా గుడిబండలో కొలువుదీరింది. ఆ ఇంటిని మనకు నచ్చిన చోటికి తరలించుకోవచ్చు కూడా. చింత అనంత రామిరెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఉన్న ఓ ప్రైవేట్ కంపేనికి రేడీమేడ్ ఇంటి కోసం ఆర్డర్ ఇచ్చారు. కాంక్రీట్, సిమెంట్, ఇనుము అవసరం లేకుండా.. ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో ఆధునిక హంగులతో వారు ఇంటిని నిర్మించి ఇచ్చారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి గుడిబండకు కంటెయినర్‌ ద్వారా తీసుకొచ్చి అమర్చారు. 

నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడే విధంగా ఆ ఇంటిలో అన్ని వసతులూ ఉన్నాయని యజమాని తెలిపారు. ఒక హాల్‌, బెడ్రూమ్‌, కిచెన్‌తోపాటు టాయిలెట్లు అధునాతన పద్ధతిలో ఉన్నట్లు పేర్కొన్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో 8 అడుగుల ఎత్తులో నిర్మించి ఉన్న పిల్లర్లపై రెండు క్రేన్ల సహాయంతో ఈ ఇంటిని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. 33 గజాల స్థలంలో ఉన్న ఈ విలాసవంతమైన ఇంటి నిర్మాణాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్థులు సైతం వస్తున్నారు. సిమెంటు, ఇనుము ధరలు అధికంగా ఉన్నవేళ తక్కువ ఖర్చుతో రెడీమేడ్‌ ఇళ్ల వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని