Lockdown: సూర్యాపేట సరిహద్దులో ఆంక్షలు!

తాజా వార్తలు

Published : 23/05/2021 01:40 IST

Lockdown: సూర్యాపేట సరిహద్దులో ఆంక్షలు!

సూర్యాపేట: కరోనా కట్టడికి తెలంగాణలో కఠిన లాక్‌డౌన్‌లో భాగంగా ఆదివారం నుంచి  సూర్యాపేట సరిహద్దులో ఆంక్షలు విధించనున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఏపీ నుంచి వచ్చేవారికి ఈ-పాస్‌ను తప్పనిసరి చేశారు. అంబులెన్సులు,అత్యవసర వాహనాలకు మాత్రం ఈ-పాస్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. అత్యవసర వాహనాలకు గుర్తింపు కార్డులు తప్పనిసరని ఎస్పీ భాస్కరన్‌ స్పష్టంచేశారు. విచ్చలవిడిగా తిరుగుతున్న జనాన్ని అదుపు చేసేందుకే ఆంక్షలు అమలుచేస్తున్నట్టు తెలిపారు. లాక్‌డౌన్‌ సడలింపు వేళల్లోనూ ఈ-పాస్‌ తప్పనిసరన్నారు. సూర్యాపేట జిల్లాలోని నాలుగింటిలో మూడు చెక్‌పోస్టులు మూసివేస్తున్నట్టు చెప్పారు. హైవే మీదుగానే అందరూ తెలంగాణలోకి రావాలని, మఠంపల్లి, పులిచింతల, రామాపురం చెక్‌పోస్టులను మూసివేసినట్టు ఎస్పీ వెల్లడించారు. కోదాడ మీదుగానే ఏపీ వాహనాలకు అనుమతిస్తామని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని