₹కోట్లు ఖరీదు చేసే కారును తగలబెట్టేశాడు
close

తాజా వార్తలు

Updated : 28/10/2020 20:18 IST

₹కోట్లు ఖరీదు చేసే కారును తగలబెట్టేశాడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాహనాల్ని ఎంతో ముచ్చటపడి కొనుక్కుంటాం. కొన్న కొత్తలో వాహనంలో ఏవైనా సమస్యలు వస్తే వాహన డీలర్‌ వద్దకి తీసుకెళ్లి పరిష్కరించుకుంటాం. అయినా సమస్య తీరకుంటే డీలర్‌కు పైస్థాయి వ్యక్తులకు ఫిర్యాదు చేస్తాం.. కానీ, ఓ వ్యక్తి తన కారులో ఏర్పడిన సమస్యకు పరిష్కారం చూపలేదని కారు డీలర్‌పై కోపంతో ఏకంగా రూ. కోట్లు విలువ చేసే కారును పెట్రోల్‌పోసి తగలబెట్టేశాడు. ఆ వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో పెట్టడంతో అది కాస్త వైరల్‌గా మారింది. 

రష్యాకి చెందిన మైఖేల్‌ లిట్విన్‌ ఒక వ్లాగర్‌. సాహసాలు, ప్రాంక్స్‌ చేస్తూ ఆ వీడియోలను తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్టు చేస్తూ ఉంటాడు. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన మెర్సిడెజ్‌-ఏఎంజీ జీటీ 63 కారును లిట్విన్‌ కొనుగోలు చేశాడు. దీని ధర మన కరెన్సీలో రూ. 2.4కోట్లు(ఇదీ ఎక్స్‌షోరూం ధర మాత్రమే. ఆన్‌రోడ్‌ ధర ఇంకా ఎక్కువే ఉంటుంది). అయితే, ఆ కారు తరుచూ బ్రేక్‌డౌన్‌ అవుతూ ఇబ్బంది పెట్టిందట. ఐదుసార్లు మెర్సిడెజ్‌ డీలర్‌ వద్దకు వెళ్లి సమస్యను వివరించినా పరిష్కారం లభించలేదట. ఫిర్యాదు చేసిన ప్రతిసారి డీలర్‌ రెండ్రోజులు కారును షాపులో ఉంచుకొని ఎలాంటి మరమ్మతులు చేయకుండానే తిరిగిస్తున్నట్లు లిట్విన్‌ ఆరోపించాడు. ఎంత ప్రయత్నించినా సమస్య తీరకపోవడంతో ఆగ్రహానికి గురైన లిట్విన్‌.. డీలర్‌కు, మెర్సిడెజ్‌ కంపెనీకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఏకంగా రూ. కోట్ల ఖరీదైన కారునే దగ్ధం చేశాడు. తన కారును విశాలమైన ప్రాంతానికి తీసుకెళ్లి, దానిపై పెట్రోల్‌ పోశాడు. కాస్త దూరం వెళ్లి అక్కడ నుంచి నిప్పు అంటించి కారును అగ్నికి ఆహుతి చేశాడు. ఈ వీడియోను తన ఛానల్‌లో పెట్టి.. ‘మెర్సిడెజ్‌ సంస్థతో గొడవ తర్వాత ఏం చేయాలా?అని ఆలోచిస్తే.. ఇలా కాల్చేయడమే సబబు అని తోచింది.. కాల్చేశా’ అంటూ వీడియో కింద రాసుకొచ్చాడు. అంతే ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. యూట్యూబ్‌లోనే ఈ వీడియోను మూడురోజుల్లో కోటి మందికిపైగా వీక్షించారు. 

అయితే, ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఎవరూ అంత ఖరీదైన కారును కావాలని దగ్ధం చేయరని, కేవలం ఇదీ పబ్లిసిటీ స్టంట్‌ కావొచ్చని అంటున్నారు. ‘తన వీడియో కోసం ఇంత ఖరీదైన కారును తగలబెట్టాడా? ఆ వీడియోకి వచ్చే వ్యూస్‌ ద్వారా వచ్చే డబ్బులు కారు ఖరీదుకు సరిపోతాయా’?, ‘ఈ వీడియో చాలా ఖరీదైంది’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని