Rythu Bandhu: 15నుంచి రైతుల ఖాతాల్లోకి సొమ్ము
close

తాజా వార్తలు

Updated : 13/06/2021 16:05 IST

Rythu Bandhu: 15నుంచి రైతుల ఖాతాల్లోకి సొమ్ము

హైదరాబాద్‌: తెలంగాణలోని రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 25 వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమచేయనున్నట్లు చెప్పారు. రైతుబంధు పథకానికి సంబంధించి ఈ ఏడాది 63,25,695 మంది అర్హులను గుర్తించిన సీసీఎల్‌ఏ తుది జాబితాను వ్యవసాయ శాఖకు అందించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150.18 లక్షల ఎకరాలకు గాను రూ.7,508.78 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. ఈసారి కొత్తగా 66,311 ఎకరాలు ఈ పథకంలో చేరాయని.. అందుకు అనుగుణంగా 2.81 లక్షల మందికి రైతుబంధు నిధులు అందనున్నట్లు మంత్రి చెప్పారు.

మొదటిసారి రైతుబంధుకు అర్హులైన రైతులు స్థానిక ఏఈఓలు, ఏఓలను కలిసి పట్టాదార్ పాస్‌ పుస్తకాలు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను అందించాలని మంత్రి సూచించారు. బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు మారిన ఖాతాదారులు ఆందోళన చెందొద్దని.. ఏమైనా సందేహాలుంటే స్థానిక వ్యవసాయాధికారులు నివృత్తి చేస్తారని తెలిపారు. అత్యధికంగా 4,72,983 మంది అర్హులుగా ఉన్న నల్లగొండ జిల్లాలో 12.18 లక్షల ఎకరాలకు రూ.608.81 కోట్లు, అత్యల్పంగా 39,762 మంది అర్హులున్న మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 77 వేల ఎకరాలకు రూ.38.39 కోట్లు నిధులు అవసరమవుతున్నాయని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని