ప్రశాంతంగా సాగుతోన్న సాగర్‌ ఉపఎన్నిక

తాజా వార్తలు

Updated : 17/04/2021 12:51 IST

ప్రశాంతంగా సాగుతోన్న సాగర్‌ ఉపఎన్నిక

నాగార్జునసాగర్‌: సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. 11 గంటల వరకు 31 శాతం ఓటింగ్‌ నమోదైంది. పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్‌ కొన్ని చోట్ల కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది.

సాగర్‌లో శశాంక్‌ గోయ్‌ల్‌ పర్యటన

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ ఉప ఎన్నిక జరుగుతున్న నాగార్జున సాగర్‌లో పర్యటించారు. పైలాన్‌కాలనీ, హిల్‌కాలనీలో పోలింగ్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు, సరళిని శశాంక్‌ గోయల్‌ పరిశీలన చేశారు.

ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు

ఉప ఎన్నిక బరిలో ఉన్న అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెరాస అభ్యర్థి నోముల భగత్‌ హాలియా ఇబ్రహీంపేటలో ఓటు వేశారు. కుటుంబ సమేతంగా ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  పల్గుతండాలో భాజపా అభ్యర్థి రవికుమార్‌ ఓటు వేశారు. నల్గొండలోని చింతగూడెంలో తెదేపా అభ్యర్థి అరుణ్‌కుమార్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఆ పార్టీ అభ్యర్థి ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని