తెలంగాణ హైకోర్టు చెప్పినా ఆపుతున్నారు: సజ్జల
close

తాజా వార్తలు

Updated : 14/05/2021 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణ హైకోర్టు చెప్పినా ఆపుతున్నారు: సజ్జల

అమరావతి: తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లు అడ్డుకోవడంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ అధికారులతో ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ మాట్లాడారు. అనంతరం ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

ఎక్కడా లేని సమస్య హైదరాబాద్‌ వెళ్లే వాళ్లకే: సజ్జల

మరోవైపు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఆపొద్దని తెలంగాణ హైకోర్టు చెప్పినా అక్కడి పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పారు. తమ వాళ్లను తాము చూసుకోవాలనే పట్టుదలలు పెరుగుతున్నాయని చెప్పారు. దీనిపై సంయమనంతో వ్యవహరిస్తున్నామని.. న్యాయస్థానాలను ఆశ్రయించి సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఏపీ రోగులు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఎక్కడా లేని సమస్య హైదరాబాద్‌ వెళ్లే వాళ్లకే వస్తోందన్నారు. ఇది మానవత్వంతో చూడాల్సిన వ్యవహారమని చెప్పారు. ఈ వ్యవహారంపై సీఎం జగన్‌ అధికారులతో చర్చించారని సజ్జల తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేని ప్రాంతాలను తమకిచ్చారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. 

తెలంగాణ సరిహద్దులో అంబులెన్స్‌లను అడ్డుకుంటున్న వ్యవహారంపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌తో ఏపీ జగన్‌ మాట్లాడుతున్నారని సజ్జల అన్నారు. అధికారికంగా కాకపోయినా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌తో జగన్‌ మాట్లాడలేదని ఎందుకు అనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఏపీలో సదుపాయాలు లేవనే రోగులు హైదరాబాద్‌ వెళ్తున్నారని తెదేపా నేతలు అంటున్నారని.. వారి ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వల్లే ప్రజలు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని హక్కును ప్రజలు కోల్పోయారని సజ్జల ఆరోపించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని