SBI ఖాతాదారులకు అలెర్ట్‌.. ఆ సేవలకు అంతరాయం

తాజా వార్తలు

Published : 21/05/2021 00:56 IST

SBI ఖాతాదారులకు అలెర్ట్‌.. ఆ సేవలకు అంతరాయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ డిజిటల్‌ సేవలకు అంతరాయం కలగనుంది. బ్యాంకుకు సంబంధించి నిర్వహణ పనుల నేపథ్యంలో బ్యాంకు డిజిటల్‌ చెల్లింపుల వేదికలైన ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో, యూపీఐ తదితర సేవలు 3 రోజుల పాటు పరిమిత సయమంలో నిలిచిపోనున్నాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంలో ఆయా సేవల్లో శుక్రవారం నుంచి ఆదివారం మధ్య అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ చేపడుతోంది. దీంతో శుక్రవారం రాత్రి 10 గంటల 45 నిమిషాల నుంచి రెండున్నర గంటల పాటు, ఆదివారం తెల్లవారుజామున 2 గంటల 40 నిమిషాల నుంచి 06 గంటల 10 నిమిషాల వరకు డిజిటల్‌ సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని బ్యాంకు తెలిపింది. తమకు సహకరించాలని ఖాతాదారులకు విజ్ఞప్తి చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని