జిల్లా కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌

తాజా వార్తలు

Updated : 01/04/2021 19:56 IST

జిల్లా కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి: పరిషత్‌ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది. పరిషత్‌ ఎన్నికలను కొనసాగిస్తూ విడుదల చేయాల్సిన ప్రకటన, హైకోర్టులో ఈ వ్యవహారంలో జరిగిన విచారణ తదితర అంశాలపై కలెక్టర్లతో ఎస్‌ఈసీ చర్చించారు. 

ఈ ఎన్నికలపై వేసిన పిటిషన్లను ఇప్పటికే హైకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈనెల 3న ఉన్నత న్యాయస్థానం ఎన్నికలపై తీర్పు వెల్లడించే అవకాశముంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును బట్టి ఎన్నికల కొనసాగింపుపై ప్రకటన చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.  తీర్పు వచ్చాకే ఎన్నికల ప్రక్రియ కొనసాగిద్దామని.. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, పంచాయతీ రాజ్ శాఖ‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని