ఏకాంతంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
close

తాజా వార్తలు

Published : 14/05/2021 09:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏకాంతంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం

సింహాచలం: సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారు నిజరూపంలో దర్శనమిచ్చారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వరుసగా రెండో ఏడాదీ చందనోత్సవ ఘట్టాన్ని ఏకాంతంగా జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అవంతి శ్రీనివాస్‌ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సింహాచలం ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌ సంచయిత గజపతిరాజు తొలిదర్శనం చేసుకున్నారు. 

ఏటా చందనోత్సవం అంగరంగ వైభవంగా జరిగేది. లక్షలాది మంది భక్తులు స్వామి నిజరూపాన్ని కనులారా దర్శించుకునేవారు. కరోనా కేసుల తీవ్రతతో గత సంవత్సరంలాగే ఈ ఏడాదీ భక్తుల సందడి లేకుండా కార్యక్రమాన్ని జరిపారు. చందనోత్సవం సందర్భంగా భక్తుల పేరిట ఆలయ కల్యాణ మండపంలో గోత్రనామ పూజలు నిర్వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని