Krishnapatnam:ఆనందయ్య ఔషధంపై అధ్యయనం

తాజా వార్తలు

Published : 21/05/2021 21:17 IST

Krishnapatnam:ఆనందయ్య ఔషధంపై అధ్యయనం

అనిల్‌కుమార్‌ సింఘాల్

అమరావతి: నెల్లూరు జిల్లా ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నట్లు ఏపీ ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. సోమవారం నుంచి శాస్త్రీయ పరిశీలన చేస్తామన్నారు. కృష్ణపట్నంలో ఆయుష్‌ విభాగ ఉన్నతాధికారులు పరిశీలిస్తారని, మందు తయారీ విధానం, వాడినవారి అభిప్రాయాలను సేకరిస్తారని అన్నారు. ఇప్పటికే కేంద్ర ఆయుష్‌ విభాగం ఉన్నతాధికారులతో చర్చించామని, ఆనందయ్య కరోనా ఔషధం వాడిన వారంతా సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఔషధంలోని మూలికలు, పదార్థాలతో దుష్పలితాలు కనిపించలేదన్నారు. అయితే ఔషధ వినియోగం వల్లే కరోనా తగ్గిందా? వైరస్‌ తీవ్రత తగ్గడం వల్లే నయమైందా? అనే దానిపై అధ్యయనం చేస్తామని సింఘాల్‌ తెలిపారు. కృష్ణపట్నంలో కరోనా కేసులు పరిశీలించాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించామని సింఘాల్‌ అన్నారు.ఇవాళ్టి నుంచి ఆయుర్వేద మందు పంపిణీ చేస్తారంటూ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ చేసిన ప్రకటనతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది వాహనాల్లో కృష్ణపట్నం తరలి వచ్చారు. దీంతో సుమారు 3కి.మీ మేరకు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో క్యూలైన్లలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీకి అధికారులు తొలుత అనుమతివ్వలేదు. అనంతరం గందరగోళ పరిస్థితుల్లో పంపిణీ ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నిలిపివేశారు. ఇవాళ్టికి ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో అక్కడికి వచ్చిన వారు నిరాశగా వెనుదిరిగారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని