Ap News: శివశ్రీ ఇల్లును కూల్చేసిన అధికారులు
close

తాజా వార్తలు

Published : 22/07/2021 00:28 IST

Ap News: శివశ్రీ ఇల్లును కూల్చేసిన అధికారులు

అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వెనకాల ఉన్న అమరారెడ్డినగర్‌ కాలనీలోని శివశ్రీ గృహాన్ని నగరపాలక సంస్థ అధికారులు బుధవారం రాత్రి కూల్చివేశారు. దీంతో శివశ్రీ తల్లి స్పృహ తప్పి పడపోయింది. ఇల్లు కూల్చివేతతో ఆమె సోదరుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భద్రతా రిత్యా సీఎం నివాసం వెనకాల ఉన్న కాలనీలోని 321 కుటుంబాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 277 కుటుంబాలకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి, ఇళ్లు మంజూరు చేసింది. వీరిలో 124 మంది స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేశారు. దీంతో వారి ఇళ్లను జేసీబీలతో అధికారులు కూల్చివేస్తున్నారు. ఇళ్ల తొలగింపును స్థానికులు అడ్డుకోవచ్చనే నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అయితే స్థలాలు ఇచ్చే విషయంలో సరైన న్యాయం జరగడం లేదని, నిరాశ్రయులకు అదనపు పరిహారం ఇవ్వాలని శివశ్రీ పోరాడుతున్నారు. మరోవైపు కక్ష సాధింపు చర్యల్లోనే భాగంగానే శివశ్రీ ఇల్లును అధికారులు కూల్చారని తెదేపా నాయకులు  పేర్కొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని