sonu sood: మంత్రి కేటీఆర్‌ అంటే ఇష్టం

తాజా వార్తలు

Updated : 06/07/2021 17:22 IST

sonu sood: మంత్రి కేటీఆర్‌ అంటే ఇష్టం

హైదరాబాద్‌: సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు సోనూసూద్‌ ఇవాళ ప్రగతిభవన్‌లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్‌ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. దేశవ్యాప్తంగా వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సోనూసూద్‌ సాయం చేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా సోనూసూద్‌ తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను, సేవా రంగంలో తన భవిష్యత్తు ప్రణాళికలను కేటీఆర్‌తో పంచుకున్నారు. తన తల్లి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌ పట్ల, ఇక్కడి వారిపట్ల తన అనుబంధాన్ని సోనూసూద్‌ పంచుకున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణకు ప్రపంచస్థాయి కంపెనీలు రావడంలో కేటీఆర్‌ కీలక పాత్ర వహించారన్నారు. కష్ట సమయాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి, వారిని ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్‌ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని సోనూసూద్‌ అన్నారు. సమావేశం అనంతరం సోనూసూద్‌కు లంచ్‌ ఏర్పాటు చేసిన కేటీఆర్‌ .. ఆయన్ను అభినందించి శాలువాతో సత్కరించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని