పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
close

తాజా వార్తలు

Updated : 21/04/2021 15:11 IST

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

భద్రాచలం: శ్రీరామనవమి ఉత్సవాలు భద్రాచలంలో వైభవంగా జరుగుతున్నాయి. అభిజిత్‌ లగ్నంలో సీతాసమేత రామచంద్రమూర్తికి కల్యాణం జరగనుంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ముత్యాల తలంబ్రాలు అందజేశారు. రాములోరి కల్యాణ క్రతువు కోసం ఆలయ ప్రాంగణాన్ని రంగు రంగుల పుష్పాలతో అలంకరించారు. నిత్య కల్యాణ మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాన్ని సుందరంగా అలంకరించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని