మూడు రోజుల్లో రాష్ట్రాలకు 96,490 వ్యాక్సిన్లు
close

తాజా వార్తలు

Published : 14/06/2021 23:21 IST

మూడు రోజుల్లో రాష్ట్రాలకు 96,490 వ్యాక్సిన్లు

దిల్లీ: రానున్న మూడు రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి 96,490 డోసులకుపైగా కొవిడ్‌ వ్యాక్సిన్‌లను అందజేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. అన్నిరాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం 1,40,70,224 టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రాలకు 26,68,36,620 వ్యాక్సిన్‌ డోసులను కేంద్రం ఉచితంగా అందజేసింది. వీటిలో వృథా అయినవాటితో కలిపి ఆయా రాష్ట్రాల్లో ఇప్పటివరకు 25,27,66,396 డోసులను ప్రజలకు ఇచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబొరేటరీ(సీడీఎల్) విడుదల చేసిన అన్ని తయారీ సంస్థలకు చెందిన టీకాల్లో 50 శాతం భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపింది. వీటిని రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తుందని పేర్కొంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని