Ts News: సీఎం కాన్వాయ్‌ అడ్డగింతకు యత్నం
close

తాజా వార్తలు

Published : 21/06/2021 17:18 IST

Ts News: సీఎం కాన్వాయ్‌ అడ్డగింతకు యత్నం

వరంగల్‌: వరంగల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు కేయూ (కాకతీయ విశ్వవిద్యాలయం) జేఏసీ విద్యార్థులు యత్నించారు. వరంగల్‌లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించి జిల్లా నూతన కలెక్టర్‌ భవన సముదాయంను ప్రారంభించడానికి వస్తున్న సీఎం కాన్వాయ్‌కు విద్యార్థులు అడ్డుపడ్డారు. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు విద్యార్థుల యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని