ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

తాజా వార్తలు

Published : 01/02/2021 01:27 IST

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెక్కాడితేగానీ డొక్కాడని ఆ కుటుంబంలో విద్యుదాఘాతం పెను విషాదాన్ని నింపింది. అప్పటివరకు కళ్లముందు ఆటలాడిన ఆ చిన్నారి ఒళ్లంతా కాలిన గాయాలతో కొట్టుమిట్టాడటం చూసి ఆ తల్లిదండ్రులు విలవిల్లాడారు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు ఆ పిల్లాడి చేతిని తొలగించారు. మెరుగైన వైద్యం అందించేందుకు డబ్బులు లేక సూర్యాపేట జిల్లాకు చెందిన ఆ నిరుపేద కుటుంబం దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది.

నడిగూడెం మండలం రామాపురానికి చెందిన బాబు-మమత దంపతుల కుమారుడు చంటి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఎనిమిదేళ్ల చంటి స్నేహితులతో ఆడుకుంటూ ట్రాన్స్‌ఫార్మర్‌ పైకెక్కి గత నెల 23న విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. తొలుత కోదాడ, తర్వాత ఖమ్మం ఆసుపత్రికి తరలించినా పట్టించుకోకపోవడంతో వరంగల్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదంలో ఎడమ చేయి పూర్తిగా దెబ్బతినడంతో భుజం వరకు తొలగించారు. చికిత్స కోసం బాలుడి తల్లిదండ్రులు ఇప్పటివరకు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు. వారికి ఇక వైద్యం చేయించే స్థోమత లేక ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద చెత్త పోయడం వల్లే ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. చెత్తకుప్పను తొలగించాలని చెప్పినా పట్టించుకోలేదని పేర్కొంటున్నారు. ఇంత జరిగినా విద్యుత్‌ అధికారులు కన్నెత్తి చూడటం లేదని తెలిపారు. బంధువులు, గ్రామస్థుల సాయంతో ఇప్పటివరకు వైద్యం చేయించారు. పూర్తిస్థాయి వైద్యానికి ఇంకా డబ్బు అవసరముంది. సరైన వైద్యం అందకపోతే కాలిన గాయాలు మరింత ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉంది. దాతలెవరైనా బాలుడిని ఆదుకోవాలని ఆ కుటుంబం, గ్రామస్థులు వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి...

కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి..

బోయిన్‌పల్లి మార్కెట్‌పై ప్రధాని ప్రశంసలుAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని