TS news: ఫీజుల కోసం ఒత్తిడి తేవొద్దు: టీఏఎఫ్‌ఆర్‌సీ

తాజా వార్తలు

Published : 26/07/2021 17:06 IST

TS news: ఫీజుల కోసం ఒత్తిడి తేవొద్దు: టీఏఎఫ్‌ఆర్‌సీ

హైదరాబాద్‌: విద్యార్థులు ఒకేసారి మొత్తం ఫీజు చెల్లించాలని ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేయవద్దని రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఆదేశించింది. రుసుముల విషయంలో ఏఐసీటీఈ నిబంధనలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రిన్స్‌టన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థిని లావణ్య ఆత్మహత్యపై టీఏఎఫ్‌ఆర్‌సీకి ఏబీవీపీ ఫిర్యాదు చేసింది. విద్యార్థులు విడతల వారీగా ఫీజులు చెల్లించేందుకు ఇంజినీరింగ్‌ కళాశాలలు అనుమతించడం లేదని, దీనిపై చర్యలు చేపట్టాలని ఏబీవీపీ కోరింది. ఏఐసీటీఈ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని టీఏఎఫ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని