చట్టప్రకారం చర్యలు తీసుకోండి: దిల్లీ హైకోర్టు

తాజా వార్తలు

Updated : 03/02/2021 04:33 IST

చట్టప్రకారం చర్యలు తీసుకోండి: దిల్లీ హైకోర్టు

గణతంత్ర దినోత్సవ ఘటనలపై కేంద్రానికి సూచన

దిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో జరిగిన ఆందోళనలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని దిల్లీ హైకోర్టు కేంద్రాన్ని, పోలీసులను ఆదేశించింది. ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా దిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న రైతులను విడిచిపెట్టాలంటూ ఒక పిటిషన్‌ దాఖలైంది. మంగళవారం ఆ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం పై విధంగా స్పందించింది. ఆ పిటిషన్‌ కేవలం ప్రచారం కోసమే దాఖలు చేశారన్న హైకోర్టు దాన్ని కొట్టేసింది.

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ గత రెండు నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. అంతకు ముందు సుప్రీంకోర్టు జనవరి 12న నూతన వ్యవసాయ చట్టాలపై స్టే విధించింది. వీటిని సమీక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో జరిగిన సంఘటనలకు సంబంధించిన పిటిషన్లను బుధవారం సుప్రీంకోర్టు విచారించనుంది.

ఇవీ చదవండి..

రైతులతో చర్చలకు సిద్ధం

డేటా ప్రైవసీకి భంగం కలగదు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని