TS News: ధ‌ర‌ణిలో నమోదైన అందరికీ రైతుబంధు

తాజా వార్తలు

Published : 06/06/2021 11:34 IST

TS News: ధ‌ర‌ణిలో నమోదైన అందరికీ రైతుబంధు

తెలంగాణ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి 

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం జ‌మ చేస్తామ‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఐఎఫ్ఎస్‌సీ కోడ్ మారిన రైతుల ఖాతాల్లోనూ నిధులు జ‌మ చేస్తామ‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ లోపు వ్య‌వ‌సాయ విస్త‌ర‌ణ అధికారుల ద్వారా రైతుల బ్యాంకు ఖాతా వివ‌రాలు సేక‌రిస్తామ‌ని తెలిపారు. క‌ర్ష‌కులు స్థానిక వ్య‌వ‌సాయ అధికారుల‌ను సంప్ర‌దించి బ్యాంకు ఖాతా, పాస్‌బుక్, ఆధార్ వివ‌రాలు అందించాల‌ని సూచించారు. ఈ నెల 10 వ‌ర‌కు ధ‌ర‌ణిలో నమోదైన ప్ర‌తి రైతుకూ రైతుబంధు సాయం అందుతుంద‌ని నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని